![]() |
![]() |

అమ్మ ప్రేమని సృష్టిలో ఎవరో కొలవలేరు. అలాంటి అమ్మని ఉన్నప్పుడే బాగా చూసుకుందాం వెళ్ళాక అమ్మతో దిగిన ఫోటోలని చూస్తూ జ్ఞాపకాల్లోకి వెళ్ళకుండా ఇప్పుడే హ్యాపీగా గడుపుదాం. ఇదే విషయాన్ని విష్ణుప్రియ ఓ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది.
విష్ణుప్రియ వాళ్ళ చెల్లి అంటే తనకి ఎంత ఇష్టమో తెలిపింది. ఓ డైమండ్ జ్యువలరీని విష్ణుప్రియకి గిఫ్ట్ గా ఇచ్చిందంట వాళ్ళ చెల్లి. అయితే ఇది వాళ్ళ అమ్మ వర్దంతి ముందు ఇచ్చిందంటూ చెప్పుకొచ్చింది విష్ణుప్రియ. మా అమ్మ తర్వాత చెల్లి అంటే ఇష్టమని తను ఇలా సర్ ప్రైజ్ చేస్తుందని అనుకోలేదంటు విష్ణుప్రియ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. గత సంవత్సరం మా అమ్మ చనిపోయింది. తన రూపంలోనే ఈ గిఫ్ట్స్ వస్తున్నాయనుకుంటా అని విష్ణుప్రియ అంది. నా చిన్నతనం నుండి మా చెల్లికి నేనేమీ ఇవ్వలేదు. కానీ తను నాకోసం డైమండ్స్, జ్యువలరీ అన్నీ కోనిస్తుంది. తన చిన్నతనంలో ఏం కావాలో అవే ఇచ్చేదానిని .. కానీ తనేమో నాకు లగ్జరీ ఐటమ్స్ అన్నీ ఇస్తుంది. ఎలా ఉంది చెల్లి నీకు అని విష్ణుప్రియ అడుగగా.. ఐ ఆమ్ ఫ్రౌడ్ ఆఫ్ యూ అక్క అని తను అంది. ఇదంతా విష్ణుప్రియ తన యూట్యూబ్ ఛానెల్ లోని ఓ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
బుల్లితెరపై యాంకర్ గా విష్ణు ప్రియ రాణించింది. సుధీర్ తో కలిసి చేసిన 'పోరా పోవే' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది విష్ణుప్రియ. మానస్ తో కలిసి విష్ణుప్రియ చేసిన 'జరీ జరీ' ఫోక్ సాంగ్ ఫేమస్ అయింది. అయితే రీసెంట్ గా మానస్ తో కలిసి చేసిన మరొక ఆల్బమ్ సాంగ్ ' గంగులు' కూడా యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇక 'దయ' వెబ్ సిరీస్ లో నటించిన విష్ణుప్రియకి సినిమా ఆఫర్లు బోలెడు వస్తున్నాయి. కాగా విష్ణుప్రియ వాళ్ళ అమ్మని గుర్తుచేసుకొని చేసిన ఈ వ్లాగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.
![]() |
![]() |